Uppenantha- Aarya-2 Lyrics - Kk
| Singer | Kk |
| Composer | Devi Sri Prasad |
| Music | Devi Sri Prasad |
| Song Writer | Chandrabose |
Lyrics
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
I Love You… నా ఊపిరి ఆగిపోయినా
I Love You… నా ప్రాణం పోయినా
I Love You… నా ఊపిరి ఆగిపోయినా
I Love You… నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావూ
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావూ
తీసుకుంటె నువ్వు ఊపిరీ పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరీ !
I Love You… నా ఊపిరి ఆగిపోయినా
I Love You… నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !
I Love You… నా ఊపిరి ఆగిపోయినా
I Love You… నా ప్రాణం పోయినా
I Love You… నా ఊపిరి ఆగిపోయినా
I Love You… నా ప్రాణం పోయినా
0 Comments