Sittharala Sirapadu Song Lyrics in Telugu
| Singer | Bada suranna, Saketh Komanduri |
| Composer | Thaman S |
| Music label | Aditya Music |
| Song Writer | Vijay Kumar Bhalla |
Lyrics
సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు
పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
మంతనాలు చేసినాడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు
బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
కొమ్ములూడ తీసిమరి , పీపలూదినాడురో
జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొపంటే
జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొపంటే
దయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
ఒదుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒదుపుగా ఒంగి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
సాముసేసె కండతోటి దేనికైనా గట్టిపోటీ
సాముసేసె కండతోటి దేనికైనా గట్టిపోటీ
అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు
సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
ఉత్తరాన ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ కళ్ళల్లో యేల యేల సుక్కలొచ్చే
సక్కనమ్మ కళ్ళల్లో యేల యేల సుక్కలొచ్చే
0 Comments