O Sandamama




Singer Mohana Bhogaraju
Composer Thaman S
Music Thaman S
Song Writer Kasarla Shyam

Lyrics

ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ

నువు జల్లే వెన్నెలంతా సల్లగుందని

మిడిసిపోకే, ఓ సందమామ

తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు

ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ

సందే ఏల కుంగుతుంటే

గెలిసినావని సంబరబడకే, ఓ సందమామ

కణకణ నిప్పుల కణిక వోలే

పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ

కీచురాళ్ళ చప్పుడు జేసి

గోసపెట్టినానుకోకే, ఓ సందమామ

మబ్బు జేసే ఘర్జనలింటే

దద్దరిల్లి బుగ్గలైతవ్ నా సందమామ

ఆకుపచ్చని అమ్మతోటి

ఆకతాయి ఆటలొద్దే, ఓ సందమామ

నిన్ను కూల్చగా జమ్మిచెట్టున

ఆయుధాలను దాచుకుందే నా సందమామ

సుట్టు సుక్కలు ఉన్నాయంటూ

సూసి నువ్వు మురిసిపోకే, ఓ సందమామ

నీ సిట్టసివరి దారిలోన నీడ కూడా

తోడు రాదే, నా సందమామ

సీకటంతా తాగి నువ్వు

సిత్తరంగా సిందెయ్యకే, ఓ సందమామ

అమావాస్య ఘడియ నీకు

ముందరుందని మర్సిపోకే, నా సందమామ

నీను నేననే పట్టుతోటి

నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ

నువ్వు పుట్టక ముందే పుట్టే

నువ్వు బోయినా ఉంటదే లోకం

నా సందమామ


O Sandamama Watch Video

Post a Comment

0 Comments