Maaraajayya Lyrics - Kaala Bhairava




Singer Kaala Bhairava
Composer GV Prakash Kumar
Music label Aditya Music
Song WriterRamajogayya Sastry

Lyrics

తననా తననా తననా

తనినా తననానే నా

తననా తననా తననే

మన్నించయ్యా తప్పు మన్నించయ్యా

మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా

వెళ్ళిరాయ్యా సెలవని అంటాంది కంటతడి

ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి

గురు దేవుడిక ఇంతటి శోఖం

వెలివేసినదా పాపపు లోకం

మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ

మా రాతలు నీ చేతితో మార్చావయ్యా

ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ

ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా

మోగనన్నదిక బడి గంట నువ్వు లేనిదే

సాగనన్నదే పాఠం నీ జాడ లేనిదే

నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే

నువ్వు గాని వెలుగేదైనా ఉన్నా లేనిదే

నీతో వలస వెళ్లిపోయింది చదువుల వెలుగు

చిమ్మ చీకటి చెరా ముసిరింది అక్షరాలకు

నిప్పులాంటి నీ విలువేం మాసిపోదుగా

నీడలెన్ని ఉన్నా అవి నిజము కావుగా

నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు

అండలేని అనాధలే రాబోయే మా రోజులు

ఆవిరవుతున్నా ఆశలకు దిక్కెవరో

మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ

నువు లేని మాలోటెవ్వరూ తీర్చేరయ్యా

ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ

ఈ మీదట ఏ ధైర్యమై సాకాలయ్యా


Maaraajayya Watch Video

Post a Comment

0 Comments