Banjara song Sir (Telugu)
| Singer | Anurag Kulkarni |
| Composer | GV Prakash Kumar |
| Music label | Aditya Music |
| Song Writer | Suddala Ashok Teja |
Lyrics
ఇల్లే నాదని
వాకిలి నాదేనంటే
పక్కున నవ్వుతదీ భూతల్లి
పడవే నాదని
అలలూ నావేనంటే
పడి పడి నవ్వుతవీ సంద్రాలే
పొట్టలో ఆకలిని
నింపుటే బతుకు అని
పిట్టలు తెలుసుకొని
ఎల్లే దారి ఎవ్వరిద
మూటలు గట్టుకొని
కావడి ఎత్తుకొని
రెక్కలే నమ్ముకొని
ఎల్లిపో రివ్వుమని
ఆడ ఉండి నీవే
ఈడ ఉండి నీవే
నీది గాని సోటే
లేనే లేదు బంజార
యాడ బుట్టె తీగ
యాడ బుట్టె బూర
తోడు గూడినాక
మీటి జూడు తంబురా
ఏ, ఎండాకాలంలో
వేడి రుచే సూడాలే
వానాకాలంలో
నీటి మువ్వై ఆడాలే
సందామామొచ్చే
యెన్నెల కాలంలో
సలితో ఇష్టంగా
దోస్తీ సెయ్యాలె
ఆడ ఉండి నీవే
ఈడ ఉండి నీవే
నీది గాని సోటే
లేనే లేదు బంజార
యాడ బుట్టె తీగ
యాడ బుట్టె బూ
తోడు గూడినాక
మీటి జూడు తంబురా
పదరా బంజారా..! ఆ ఆ ఆ ఆఆ ఆ
ఇల్లే నాదని… వాకిలి నాదేనంటే
పక్కున నవ్వుతదీ భూతల్లి (నవ్వుతదీ)
పడవే నాదని… అలలూ నావేనంటే
పడి పడి నవ్వుతవీ సంద్రాలే (సంద్రాలే)
పొట్టలో ఆకలిని
నింపుటే బతుకు అని
పిట్టలు తెలుసుకొని
ఎల్లే దారి ఎవ్వరిదే
మూటలు గట్టుకొని
కావడి ఎత్తుకొని
రెక్కలే నమ్ముకొని
ఎల్లిపో రివ్వుమని
మూటలు గట్టుకొని
కావడి ఎత్తుకొని
పదరా బంజారా ఆ ఆ
0 Comments