One Life Lyrics in Telugu- Sir Movie (Telugu)




Singer Hema Chandra Vedala ,Pranav Chaganty
Composer GV Prakash Kumar
Music label Aditya Music
Song WriterPranav Chaganty

Lyrics

చదువుల ఒడిలో అడుగడుగడుగున

ఒడిదుడుకులతో తలపడగలిగిన

తడపడడమే పాదమెరుగని చిరు

చిరుతల కధలో గతుకులివే

కలలెరుగని కలతలివే, కలతలివే

దిశలెరుగని మలుపులివే, మలుపులివే

వెనకడుగే పడితే భవితే నిలబడదే

తిరగబడే నిమిషమిదే

మార్పుతో తెరుచుకునే మలుపులెన్నో, ఎన్నో

మునుముందిక విచ్చుకునే ఆశలెన్నో,ఎన్నెన్నో

అలుపులేక కలలు కనే టెన్ టు ఫైవ్ కనులు ఎన్నో

నలుపుపైన తెలుపుతోన దరికి చేరే గెలుపులెన్నో

చివరికెన్నో

జీవితాలు మారి పంజరంలో చిలుకలే

బంజరులో మొలకలా ఎదిగి అణచబడ్డ

ఆశలన్ని ఎక్కు పెట్టరా ధనస్సులా

చదువే గతిరా… బడులే నిధిరా

చెపితే వినరా… ఉన్నది వన్ లైఫ్

బరిలో పులిలా… బెరుకే విడరా

ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్

తారలు రాలుతు నేలకి రావా

కన్నుల్లో దాగే ఆశలు కావా

బాధలు కూడా బద్దలు కావా

ఆడుతు పాడుతు సాగుతుపోవా

చదువే గతిరా… బడులే నిధిరా

చెబితే వినరా… ఉన్నది వన్ లైఫ్

బరిలో పులిలా… బెరుకే విడరా

ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్

మది కాసుకి పెనవెయ్యాలి

పది కాసులు వెనకెయ్యాలి

సాయానికి ముందుండాలి

ఇదిరా వన్ లైఫ్  ఓ

దర్జాగా నువ్ బతకాలి

చీకటిలో వెలుగవ్వాలి

అందుకనే చదివెయ్యాలి

ఉన్నది వన్ లైఫ్ ఓ

నీ గలగల చెమటల సడులే

వలవలుగా అమ్మని చేరి

తన కన్నుల జన్మై మెరిసే

క్షణమే వన్ లైఫ్

ఏ దిక్కున నువ్వుంటున్నా

నాన్నకి మర్యాదే తెస్తూ

తన కాలర్ పైకెగరేసే

క్షణమే వన్ లైఫ్

ఆడర వన్ లైఫ్

పాడర వన్ లైఫ్

పట్టాలే తప్పకు

ఉన్నది వన్ లైఫ్

చదువే గతిరా… బడులే నిధిరా

చెబితే వినరా… ఉన్నది వన్ లైఫ్

బరిలో పులిలా… బెరుకే విడరా

ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్.


One Life Watch Video

Post a Comment

0 Comments